![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -99 లో.....చక్రి, మాధవ గొడవపడతారు. అప్పుడే మహా వచ్చి వాళ్ళు అలా తయారు కావడానికి కారణం మీరే అని మాధవతో మహా అంటుంది. మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతానని మహా అనగానే కన్నా ఏడవడం మొదలుపెడుతాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ రా అని మహా అనగానే మీరు వెళ్ళిపోతానని అంటున్నారు కదా అని కన్నా అనగానే అదేం లేదు వాళ్లని బెదిరించడానికి అలా చెప్పానని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ తన వర్క్ చేస్తాడు. అప్పుడే కవిత ఫోన్ చేసి మాట్లాడుతుంది. మిమ్మల్ని కలవాలని అంటుంది. మాధవకి ఇష్టం లేకున్నా సరే అంటాడు.
ఆ తర్వాత కవితని మాధవ కలుస్తాడు. కాఫీ ఆర్డర్ చేస్తుంది పెళ్లికి ముందే నా ఇష్టానికి విలువ ఇచ్చారు.. చాలా థాంక్స్ అని కవిత అంటుంది. మాధవకు ఏం అర్థం కాదు. ఆ తర్వాత మనం ఇల్లు ఎక్కడ తీసుకుందామని మాధవని కవిత అడుగుతుంది ఎందుకు మా ఇల్లు ఉంది కదా అని మాధవ అంటాడు. మీరు ఏం తెలియనట్లు మాట్లాడతారేంటి.. మనం సపరేట్ గా ఉంటాం అంటేనే కదా మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుందని కవిత అనగానే మళ్ళీ వస్తానని మాధవ అక్కడ నుండి ఇంటికి కోపంగా వెళ్తాడు. లోపలకి వెళ్లి బ్యాగ్ తీసుకొని వస్తాడు. అదంతా చూసి మహా వాళ్ళు ఏమైందని అడుగుతారు. మీరు ఇదే కదా కోరుకుంది అని మాధవ అంటాడు. తన దగ్గర పెళ్లి తర్వాత సపరేట్ ఉండాలన్న విషయం దాచి ఉంచినందుకు మాధవ కోపంగా ఉంటాడు. నాతో మీకు అవసరం అయిపోయిందా అంటూ ఎమోషనల్ అవుతాడు మాధవ. అప్పుడే కవిత ఫోన్ చేస్తుంది. ఇప్పుడే కాదు నా తమ్ముళ్ళని ఎప్పటికి వదిలి రానని కవితతో మాధవ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.ఆ తర్వాత తమ్ముళ్ళని ఎలా పెంచాడో మాధవ చెప్తుంటే ముగ్గురు తమ్ముళ్లు కాళ్ళు పట్టుకొని ఎమోషనల్ అవుతారు.
ఆ తర్వాత మరుసటి రోజు మాధవ దగ్గరికి మహా వస్తుంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది అని మహా అనగానే ఇందులో కథానాయిక నువ్వే అని తెలుసు అని మాధవ అంటాడు. మరి కోపం రాలేదా అని మహా అడుగుతుంది. మీరు నా గురించి ఆలోచించారు కదా అని మాధవ అంటాడు. ఆ తర్వాత మహాకి సర్ ప్రైజ్ అంటూ చక్రి తనని తీసుకొని యూనివర్సిటికి వెళ్తాడు. మీరు ఇక్కడ మీ సర్టిఫికెట్స్ గురించి అప్లికేషన్ చేసుకోవచ్చు.. అదే మీకు సర్ ప్రైజ్ అని మహాతో చక్రి అనగానే మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహా లోపలికి వెళ్తుంటే అక్కడ కొంతమంది అమ్మాయిలు చక్రిని చూస్తారు. ఆ అమ్మాయిలు ఏంటి నిన్ను చూస్తున్నారని మహా అడుగుతుంది. నాకేం తెలుసు అని చక్రి అంటాడు. షర్ట్ బటన్స్ విప్పుకొని వస్తుంటే చూడరా అని మహా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |